కైరా మరో కత్తిలాంటి ఐటెం

మరిన్ని వార్తలు

'రేసుగుర్రం' సినిమాలో 'బూచాడే.. బూచాడే..' అంటూ ఐటెం సాంగ్‌తో కేక పుట్టించింది ముద్దుగుమ్మ కైరా దత్‌. తర్వాత 'పైసా వసూల్‌'లో బాలయ్యతో స్టెప్పులు ఇరగదీసింది. 'పైసా వసూల్‌'లో ఫుల్‌ డోస్‌ గ్లామర్‌తో ఓ రేంజ్‌లో ఎట్రాక్ట్‌ చేసింది. ఐటెం గాళ్‌గా ఈ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది కైరా దత్‌. 

తాజాగా మరో సినిమా కోసం కత్తి లాంటి ఐటెం సాంగ్‌ని ఎంచుకుందీ క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ. సినిమా పేరు 'ఇగో'. ఆశిష్‌రాజ్‌, సిమ్రన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కైరా ఐటెం సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానుందట. మామూలు ఐటెం సాంగ్స్‌ అన్నింటికీ ఈ సాంగ్‌ భిన్నంగా ఉండబోతోందట. సాంగ్‌ స్టార్ట్‌ అయ్యే సిట్యువేషన్‌ చాలా కొత్తగా ఉంటుందంటోంది చిత్ర యూనిట్‌. అవన్నీ నచ్చే ఈ ముద్దుగుమ్మ ఈ సాంగ్‌లో నర్తించేందుకు ఒప్పుకుందట. ఈ సాంగ్‌లో స్టెప్పులు కూడా సరికొత్తగా ఉండనున్నాయట.  

అల్లు అర్జున్‌ పక్కన జోరుగా స్టెప్పులేసింది 'రేసుగుర్రం'లో. అలాగే అంతకుమించిన జోరుతో మాస్‌ స్టెప్పులు ఇరగదీసేసింది బాలయ్యతోనూ. ఇప్పుడు యంగ్‌ హీరో ఆశిష్‌రాజ్‌తో స్టేజ్‌ దద్దరిల్లే స్టెప్పులేయనుందట ఈ ఐటెం బ్యూటీ. వరుసగా ఆఫర్స్‌ అందుకుంటోంది ఐటెం గాళ్‌గా ఈ ముద్దుగుమ్మ. అయితే ఓన్లీ ఐటెం సాంగ్సేనా అంటే, అలా ఏం లేదు. మంచి ఆఫర్‌ వస్తే, నటిగానూ సత్తా చాటుతానంటోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఐటెం సాంగ్స్‌కే ఆఫర్స్‌ వస్తున్నాయనీ అంటోంది.

ఈ సినిమాలో ముద్దుగుమ్మ దీక్షా పంథ్‌ ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ మధ్య 'బిగ్‌బాస్‌' టీవీ షోతో పాపులర్‌ అయ్యింది బ్యూటీ దీక్షా పంథ్‌. ఈ సినిమాలోని స్పెషల్‌ రోల్‌ తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందంటోంది. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS