లేడీ విలన్‌ కొత్త గెటప్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

ఈ మధ్య లేడీ విలన్‌గా ఆమె పేరు మార్మోగిపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో పవర్‌ఫుల్‌ యంగ్‌ లేడీ విలన్‌గా స్టార్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది. ఆమె మరెవరో కాదు, వరలక్ష్మీ శరత్‌కుమార్‌. 'పందెం కోడి 2', 'సర్కార్‌' సినిమాల్లో విశాల్‌, విజయ్‌లకు ధీటుగా విలనిజం చూపించి, ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా వరలక్ష్మీ ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతోంది. 

 

ఈ రోజు వరలక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసి, ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది చిత్ర యూనిట్‌. 'డానీ' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో వరలక్ష్మి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపంచనుంది. ఆ పాత్రకు సంబంధించిన లుక్కే ఇది. చేతిలో గన్‌తో చిరుతలాంటి పవర్‌ఫుల్‌ చూపులతో కనిపిస్తున్న గెటప్‌ ఒకటి. మఫ్టీలో ఉన్న పోలీసాఫీసర్‌ గెటప్‌ ఇంకోటి. పక్కన ఓ డాగ్‌ కూడా కనిపిస్తోంది. అంటే ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా వరలక్ష్మి నటిస్తోందనీ అర్ధమవుతోంది. 

 

ఈ రెండు లుక్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సంతానమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శరత్‌కుమార్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన తనయ వరలక్ష్మికి కూడా తెలుగు ఆడియన్స్‌ నుండి మంచి ఆదరణ దక్కుతోంది. 'డానీ'తో పాటు తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులు వరలక్ష్మి కోసం క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ ఓ ప్రాజెక్టు ఫైనల్‌ అయ్యింది కూడా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS