గ్లామ్‌షాట్‌: 'కిర్రాక్‌' గ్లామర్‌: డోస్‌' పెంచిన కన్నడ భామ.!

By Inkmantra - March 05, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా గ్లామర్‌ డోస్‌ మెల్ల మెల్లగా పెంచుతోంది. ఇంతవరకూ పర్‌ఫామెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చిన రష్మికా ఇప్పుడిప్పుడే గ్లామర్‌ పాత్రలపైనా ఫోకస్‌ పెడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సోషల్‌ మీడియాలో చిన్న చిన్నగా గ్లామర్‌ పిక్స్‌ని అప్‌లోడ్‌ చేస్తూ, స్క్రీన్‌ టెస్ట్‌ చేసుకుంటోంది. 

 

ఫ్యాన్స్‌లో అసలే ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇక గ్లామర్‌ బాణం విసిరిందంటే కుర్రకారు కుదురుగా ఉంటారా.? సూపర్‌, బంపర్‌ అంటూ పోస్ట్‌లు పెట్టేస్తూ ఎంకరేజ్‌ చేసేస్తున్నారు. ఇంతలా ఎంకరేజ్‌మెంట్‌ ఉంటే ఇంకేమి నెక్స్ట్‌ రెచ్చిపోవడమే. 

 

అయితే ఎక్స్‌పోజింగ్‌ విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్‌ ఉన్నాయంటోంది ముద్దుగుమ్మ రష్మికా. ఆ లిమిట్స్‌ తానెప్పుడూ గుర్తుంచుకుంటానంటోంది. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, ఇదేమంత పెద్ద ఎక్స్‌పోజింగ్‌ కాదుకానీ, అల్ట్రా మోడ్రన్‌ డ్రస్సుల్లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS