హాట్‌ హాట్‌ 'జూలీ' వచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

గతంలో నేహా ధూపియా హీరోయిన్‌గా తెరకెక్కిన 'జూలీ' సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'జూలీ - 2' టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజు నుండీ సెన్సేషన్‌కి ఏమీ ఢోకా లేదు. బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీ ఇది. సో హాట్‌ హాట్‌ న్యూస్‌తో జూలీగా లక్ష్మీరాయ్‌ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్‌లో లక్ష్మీరాయ్‌ చేస్తున్న తొలి సినిమా ఇది.  

తొలి సినిమాతోనే ఇంత క్రేజ్‌ సంపాదించేసుకుంటోంది లక్ష్మీరాయ్‌. ఇదంతా సినిమా విడుదల కాకముందే జరుగుతుండడం విశేషం. కాగా ఈ సినిమాని హిందీతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. నవంబర్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్‌ ఒక్కసారి బికినీలో కనిపిస్తేనే ఆ సీన్‌ సినిమాకి హైలైట్‌ అవుతుంది. అలాంటి హైలైట్స్‌ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. నూరు రకాల బికినీలతో లక్ష్మీరాయ్‌ కనిపించనుంది ఈ సినిమాలో. ఇప్పటికే పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్స్‌ ఓ రేంజ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన కాంచనమాల కేబుల్‌ టీవీ'సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత లక్ష్మీరాయ్‌ని పెద్దగా పట్టించుకోలేదు.  

ఇటీవలే ఐటెం గాళ్‌గా పవర్‌స్టార్‌తోనూ, మెగాస్టార్‌తోనూ కూడా చిందేసి పాపులారిటీ సంపాదించుకుంది. తమిళంలో 'కాంచన' సినిమాతో పాపులర్‌ అయ్యింది. తాజాగా 'జూలీ - 2' సినిమాతో మళ్లీ హీరోయిన్‌గా అందర్నీ మెస్మరైజ్‌ చేయనుంది లక్ష్మీరాయ్‌. ఈ సినిమా కోసం లక్ష్మీరాయ్‌ ఒళ్లు తగ్గించి, స్లిమ్‌గా హాట్‌గా చాలా అందంగా మారిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS