గ్లామ్‌షాట్‌: బ్లూ హాట్‌ 'రత్తాలు'.!

By iQlikMovies - January 02, 2019 - 10:12 AM IST

మరిన్ని వార్తలు

2017లో 'ఖైదీ నెం. 150' సినిమాతో చిరంజీవి పక్కన హాట్‌ హాట్‌ స్టెప్పులేసి, ఆ ఇయర్‌కి టాప్‌ ఐటెం బాంబ్‌గా నిలిచింది రత్తాలు లక్ష్మీరాయ్‌. ఆ ఊపుతో లక్ష్మీరాయ్‌ దశ తిరిగిపోతుందని భావించారంతా. అయితే ఆ తర్వాత రత్తాలు బాలీవుడ్‌లో 'జూలీ 2' సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేసి, టాలీవుడ్‌కి కాస్త దూరమైంది. అదే ఉత్సాహంలో టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూసుంటే అమ్మడి కెరీర్‌ మరోలా ఉండేదేమో. 

 

అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ రత్తాలు పుంజుకుంటోంది. ఈ ఏడాది 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' అనే డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తోనూ ఆకట్టుకోనుంది. సో రత్తాలుకి ఈ ఏడాది టాలీవుడ్‌ ఎలాంటి సక్సెస్‌లని కట్టబెడుతుందో చూడాలి మరి. 

 

ఇక సినిమాల సంగతి అటుంచితే, రత్తాలుగా వచ్చిన పాపులారిటీతో సోషల్‌ మీడియాలో అమ్మడి హవా బాగా పెరిగింది. సెక్సీ పిక్స్‌తో దుమ్ము దులిపేస్తోంది హాట్‌ హాట్‌ రత్తాలు. ఈ బ్లూ హాట్‌ బికినీలో రత్తాలు పుట్టిస్తున్న సెగలు అన్నీ ఇన్నీ కావు. ఆలస్యం చేయకుండా ఓ లుక్కేస్కోండి బాసూ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS