రామ్గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా.? తీసుకురాలేడా.? ఈ ప్రశ్న ఎలా ఉందంటే 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..' ? అన్నట్లుంది. 'బాహుబలి పార్ట్ 2' విడుదలయ్యాక కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సంగతి తెలియలేదు. అది రాజమౌళి సినిమా. కానీ వర్మ అలా కాదు. సినిమా ముందే చూపించేశాడు.
వాస్తవానికి వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్', ఎన్టీఆర్ జీవితంలో జరిగిన విషయాల్నే. అవేంటో అందరికీ తెలుసు. వర్మ కొత్తగా చూపించేదేమీ ఉండదు. అయితే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని ఎప్పుడు విడుదల చేస్తాడో కానీ, ఈలోగా ఆ సినిమా పేరు చెప్పి, చంద్రబాబును ఓ రేంజ్లో ర్యాగింగ్ మాత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఓ సీన్ లీకైపోయింది. ముందు ముందు ఇంకెన్ని లీకవుతాయో తెలీదు.
లీకుల సంగతి పక్కన పెడితే, వీలు చిక్కినప్పుడల్లా ఓ ట్వీట్ వేస్తూ అభిమానులకు స్పెషల్ కిక్ ఇస్తున్నాడీ సంచలన దర్శకుడు. సినిమా ఇంకాస్త లేట్ అయితే బాగుంటుంది.. ఈలోగా వర్మ, చంద్రబాబును ర్యాగింగ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు యాంటీ చంద్రబాబు వర్గం. దటీజ్ రామ్గోపాల్ వర్మ. అదేంటో వర్మ ట్వీటేసినా, సినిమా తీసినా అందులో ఉండే ఆ కిక్కే వేరప్పా.