యాంకర్‌ ప్రదీప్‌ హీరో అవుతున్నాడోచ్‌.!

మరిన్ని వార్తలు

యాంకర్స్‌ అంటే బుల్లితెరకు మాత్రమే పరిమితమా.? అస్సలు కాదు. గతంలో, వర్తమానంలో ఇప్పటికే పలువురు యాంకర్లు బుల్లి తెర నుండి పెద్ద తెరకు ప్రమోట్‌ అయ్యారు. గతం సంగతి పక్కన పెడితే, లేటెస్ట్‌ ట్రెండ్‌లో అనసూయ, రష్మీ వంటి ఫీమేల్‌ యాంకర్స్‌తో పాటు రవి తదితర మేల్‌ యాంకర్స్‌ కూడా బిగ్‌ స్క్రీన్‌పై సత్తా చాటుతున్నారు. పొట్టి వాడైనా గట్టి వాడు ప్రదీప్‌కి బుల్లితెరపై తిరుగే లేదు. తనదైన టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. 

 

ఇక ఆ టైమింగ్‌కి పెద్ద తెరపై కూడా టైమ్‌ ఇచ్చేశాడట. త్వరలో ప్రదీప్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనీ తెలుస్తోంది. ఆల్రెడీ సినిమా సైలెంట్‌గా షూటింగ్‌ జరుపుకుంటోందట. సుకుమార్‌ అసిస్టెంట్‌ మున్నా ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడట. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నాడట. ఇంకేముంది త్వరలో ప్రదీప్‌ కూడా పెద్ద తెరపై సందడి చేస్తాడన్న మాట. 

 

జబర్దస్త్‌తో ఫేమ్‌ సంపాదించిన షకలక శంకర్‌, ధనాధన్‌ ధన్‌రాజ్‌ వంటి వారు ఆర్టిస్టులుగానూ, హీరోలుగానూ తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుసుకున్నారు ఆల్రెడీ. ఇక ఇప్పుడు ప్రదీప్‌ టైమొచ్చింది. బుల్లితెరపై యాంకర్‌గా బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ప్రదీప్‌ పెద్దతెరపై హీరోగా ఎలా ప్రూవ్‌ చేసుకుంటాడో చూడాలి మరి. అయితే ఈ విషయం ప్రదీప్‌ కానీ, చిత్ర యూనిట్‌ కానీ అఫీషియల్‌గా ఇంకా కన్‌ఫామ్‌ చేయలేదెందుకో మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS