ఎన్టీఆర్ గొప్పతనం గురించి తెలియనిది ఎవరికి. సినీ నటుడిగా ఆయన ఎలాంటి సినిమాలు చేశారు.? ఓ రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఎంతగా ఎదిగారు అనేది అందరికి తెలుసు. వాటి గురించి ఎవరూ కొత్తగా చూపించక్కర్లేదు. కానీ ఎన్టీఆర్ మానసిక సంఘర్షణ మాత్రం ఎవరికి తెలియదు. స్వయంగా ఆయనే వచ్చి తన ఆవేదన వెల్లగక్కుకున్నా అది అర్ధం కాదెవరికీ.
అలాంటిది ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తే అదో గొప్ప కావ్యం అవుతుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఆ బాధ్యతను వర్మ భుజానికెత్తుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నుండి ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు రామ్‌గోపాల్ వర్మ. ఫస్ట్‌లుక్‌లో భాగంగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ టీజర్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఒకవేళ ఎవరైనా ఎన్టీఆర్‌ని ద్వేషించినవారుంటే వారు కూడా ఈ ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ని అలా చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఒక్క ఇంట్రడక్షన్‌తో వర్మ పూర్తి మార్కులు కొట్టేశారు. దాదాపు మూడు గంటలు సినిమాతో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో చేయలేకపోయిన మ్యాజిక్‌ని రామ్‌గోపాల్‌వర్మ కొన్ని సెకన్ల నిడివి ఉన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇంట్రడక్షన్‌తో సాధించేశారు. దటీజ్ రామ్‌గోపాల్ వర్మ. శ్రీతేజ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తుండగా, లక్ష్మీపార్వతి పాత్రను కన్నడ నటి యజ్ఞాశెట్టి పోషిస్తోంది.