దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ అంతే.!

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలకు సెట్స్‌ పైకి వెళ్లే ముందే రావల్సినంత హైప్‌ క్రియేట్‌ చేసేస్తారు. విడుదలకు ముందే బోలెడంత పబ్లిసిటీ మూట కట్టేస్తారు. వర్మ గారి తాజా చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయంలోనూ అదే జరుగుతోందిప్పుడు. ఆల్రెడీ భారీ అంచనాలతో తెరకెక్కి, ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఫట్‌ అవ్వడంతో వర్మకి అది బాగా కలిసొచ్చేసింది. అందరి దృష్టి వర్మ సినిమాపై పడింది.

 

వర్మని ఎలాగూ తక్కువంచనా వేయలేం. అందులోనూ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని వర్మ ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. పై లోకాల్లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆశీర్వాదాలన్నీ తన సినిమాకే ఉంటాయని వర్మ నమ్మకంగా చెబుతున్నారు. దాంతో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'పై ఆశక్తి బాగా నెలకొంది. ఇకపోతే తాజాగా వర్మ ట్వీట్‌ పరిశీలిస్తే, స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా వర్మ ఏదో మ్యాజిక్‌ చేయబోతున్నారని అర్ధమవుతోంది. జనవరి 18 అంటే ఈ రోజు స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతి.

 

ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 'ఆ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌!' జీవం పోసుకోబోతోంది అంటూ వర్మ చేసిన తాజా ట్వీట్‌ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'కి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏదో ఇవ్వబోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఈ ట్వీట్‌ చూశాక వర్మ అభిమానుల్లో ఆశక్తి మరింత పెరిగిపోయింది. ఇంతకీ అదేంటో తెలియాలంటే సాయంత్రం 5 గంటల వరకూ ఆగడం తప్ప చేసేదేం లేదు మరి. ఇకపోతే టైటిల్‌ రోల్‌లో కన్నడ భామ యజ్ఞాశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS