ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బాలయ్య స్వీయ నిర్మాణంలో వచ్చిన ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫెయిల్యూర్‌ని చవి చూసింది. ఇక నెక్ట్స్ లెవల్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తానేంటో నిరూపించుకోవడానికి రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇంతలోనే సందట్లో సడేమియా అన్నట్లుగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీస్ వీరగ్రంధం' టీజర్ వచ్చేసింది.
అయితే టీజర్‌లో ఏం చూపించారయ్యా అంటే, ఏమీ చూపించలేదు. బ్యాక్ గ్రౌండ్‌లో ఏవో డైలాగులు వస్తున్నాయి. కానీ క్యారెక్టర్స్‌ని మాత్రం రివీల్ చేయలేదు. చూపించారు కానీ పాక్షికంగా చూపించారు. టైటిల్, పోస్టర్ కూడా తేడాగానే ఉన్నాయి. వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కథకు లక్ష్మీపార్వతి హీరో కాగా, 'లక్ష్మీస్ వీరగ్రంధం'లో లక్ష్మీ పార్వతి పాత్ర భిన్నంగా అనిపిస్తోంది. నెగిటివ్‌గా కనిపిస్తోంది. నెగిటివ్‌గా చూపిస్తే లక్ష్మీపార్వతి నుండి వ్యతిరేకతను తట్టుకోవడం సాధ్యమేనా.?
వర్మ తన స్టోరీని లక్ష్మీపార్వతికి చెప్పి, ఆమె అనుమతితోనే తెరకెక్కిస్తున్నారు. కానీ 'వీరగ్రంధం' మాత్రం ఆమెకు పూర్తి వ్యతిరేకంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయ్యాక ఆయన జీవితం ఎలా పతనమైపోయింది.? అసలింతకీ ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ కాకముందు లక్ష్మీపార్వతి ఏంటీ.? అనే నేపథ్యంలో 'లక్ష్మీస్ వీరగ్రంధం' తెరకెక్కుతోంది. ఈ అంశం ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా, వివాదాలకు ఎక్కువ ఆస్కారముంది. అలాంటి పరిస్థితిని తట్టుకుని ఈ సినిమా విడుదలవ్వడం సాధ్యమేనా.? చూడాలి మరి ఏం జరుగుతుందో.!