గ్లామర్ అంటే టూ పీస్ బికినీలోనో, లేక పొట్టి పొట్టి డ్రస్సుల్లోనో ఉండదంటోంది ముద్దుగుమ్మ నభా నటేష్. అంటే ఎవరని అడక్కండి. సుధీర్‌బాబు హీరోగా వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో ఆల్రెడీ కొందర్ని దోచేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత రవిబాబు సినిమా 'అదుగో'తో పందిపిల్లతో కలిసి అల్లరి చేసేసింది. అయితే ఈ రెండు సినిమాలూ ఈ భామకు ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు కానీ, గతేడాది వచ్చిన డెబ్యూ హీరోయిన్స్‌లో చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే తెచ్చుకుంది.
ఇక గ్లామర్ విషయం అంటారా.? తనకేమీ పరిమితులు లేవంటోంది. స్టోరీ, సీనూ డిమాండ్ చేస్తే ఎంత హాట్‌గా కనిపించడానికైనా రెడీ అంటోంది. అయితే హాట్‌గా కనిపించడమనేది వేసుకునే డ్రస్సులో ఉండదంటూ శాంపిల్‌గా ఇదిగో ఈ గ్లామర్ యాంగిల్‌ని నెట్టింట్లో వదిలింది. లంగావోణీనే అయినా హాట్నెస్ అన్లిమిటెడ్.. అది చూసే వాళ్ల కళ్లను బట్టి ఉంటుందని చెప్పకనే చెబుతున్నట్లుంది ఈ పిక్.