తమన్నా ఔట్‌, లావణ్య ఇన్‌

మరిన్ని వార్తలు

'100 పర్సంట్‌ లవ్‌' సినిమాలో తమన్నా భాటియా తన మిల్కీ సొగసులతో ఆకట్టుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. సింపుల్లీ సూపర్బ్‌ అన్పించే లవ్‌స్టోరీ ఇది. నాగచైతన్య కెరీర్‌లో తొలి కమర్షియల్‌ సూపర్‌ సక్సెస్‌ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమాని తమిళంలోకి రీమేక్‌ చేస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా మారి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించాడు. ఈయనే తమిళంలో హీరోగా నటించనున్న '100 పర్సంట్‌ లవ్‌' రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ముందుగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నానే అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆ ఛాన్స్‌ లావణ్య దక్కించుకున్నట్లు సమాచారమ్‌. జివి ప్రకాష్‌కుమార్‌ ఎవరో కాదు, సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌కి స్వయానా మేనల్లుడు. 'డార్లింగ్‌' తదితర తెలుగు సినిమాలకు సూపర్బ్‌ మ్యూజిక్‌ అందించాడు జివి ప్రకాష్‌కుమార్‌. తెలుగులో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమా తమన్నాకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత తమన్నాకి తిరుగే లేకుండా పోయింది. అలాగే తమిళంలోనూ ఈ సినిమాపై అంచనాలున్నాయి. క్లాసిక్‌ మ్యూజిక్‌తో అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు లేకపోలేవు. అదే కనుక జరిగితే కోలీవుడ్‌లో బ్యూటీ లావణ్యకి స్టార్‌ తిరిగినట్లే. తెలుగులోనూ లావణ్య బిజీగానే గడుపుతోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS