'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలామంది సెలబ్రిటీలు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో తిక్క తిక్క ప్రశ్నలకు కొంత ఇబ్బంది పడుతుంటారు. అదే పరిస్థితి లావణ్య త్రిపాఠికి కూడా ఎదురయ్యింది. కానీ, లావణ్య ఓ తిక్క అభిమానికి గట్టిగా బుద్ధి చెప్పింది.
లావణ్య ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఫొటో విషయమై జుగుప్సాకరమైన కామెంట్ చేయడంతో, తెలుగులోనే లావణ్య అతనికి షాక్ ఇచ్చింది. 'నీ థింకింగ్ ఆల్రెడీ కిందకే వుంది.. సో నా ఫుల్ ఫొటో పెట్టినా నీ థాట్ ప్రాసెస్ కన్నా పైకే వుంటుంది..' అని సమాధానమిచ్చింది లావణ్య త్రిపాఠి.
లావణ్య సమాధానంతో చాలామంది అభిమానులు పండగ చేసుకున్నారు. 'లావణ్య తెలుగులోనూ ట్వీట్ చేసిందహో..' అంటూ అభిమానులు మురిసిపోతోంటే, 'చెత్త ఎక్స్‌పోజింగ్ చేసి, మళ్ళీ సమర్థించుకోవడమా.? గ్లామర్ పేరుతో, అంగాంగ ప్రదర్శన చేయడమా.? ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా.? ఇదేనా సభ్యత.?' అంటూ మరికొందరు లావణ్యను తిట్టిపోస్తున్నారు.
గ్లామరస్ ప్రపంచంలో 'అందాల ప్రదర్శన' చాలా చిన్న విషయంగా మారిపోయింది. టూ పీస్ బికినీల్లోనూ, సెమీ న్యూడ్ ఫొటో సెషన్లలోనూ ఒదిగిపోతున్నారు అందాల భామలు. వారి భంగిమల గురించీ, గ్లామరస్ యాంగిల్ గురించీ నెగెటివ్ కామెంట్స్ చేసి ప్రయోజనం లేదు. ట్రెండ్ మారింది, ఆ ట్రెండ్‌తోపాటే పండగ చేస్కోవడమే.