ఈ రోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడు సినిమాలు ప్రదర్శితమవుతున్న ధియేటర్స్ వద్ద క్రౌడ్ ఒకేలా కనిపిస్తోంది. అంటే ఈ మూడు సినిమాలకీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినట్లే అని తెలుస్తోంది. ఇందుకు కారణం ఈ మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ప్రతిష్ఠాత్మకమైనవి కావడమే. అలాగే వాటి స్థాయికి ఇవి భారీ చిత్రాలగానే పరిగణించవచ్చు. చాలా కాలం తర్వాత తేజ నుండి వస్తోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా. 'బాహుబలి', ఘాజీ' సినిమాల తర్వాత రానా నటిస్తున్న చిత్రమిది. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ ఇందులో హీరోయిన్. ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మరో సినిమా 'జయ జానకి నాయకా'. బోయపాటి శీను దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'సరైనోడు' చిత్రం సూపర్ హిట్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు బెల్లంకొండ. అలాగే ముచ్చటగా మూడో సినిమా 'లై'. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషించడం మెయిన్ అట్రాక్షన్ కాగా, 'అ,ఆ..' వంటి సూపర్ సక్సెస్ సినిమా తర్వాత నితిన్ నటిస్తోన్న సినిమా ఇది. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌తోనే ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ ముగ్గురిలో విజేత ఎవరు? ముగ్గురూ విజేతలు కావాలని కోరుకుంటోంది టాలీవుడ్. అలాగే మనం కూడా కోరుకుందాం.