సమంత - చైతూ పెళ్లి శుభలేఖ ఇది నిజమేనా?

మరిన్ని వార్తలు

సమంత - చైతూ పెళ్లి శుభలేఖ వచ్చేసింది. సోషల్‌ మీడియాలో ఈ శుభలేఖ చక్కర్లు కొడుతోంది. అయితే అధికారికంగా అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన శుభలేఖ కాదిది అంటూ మరో పక్క ప్రచారం. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం వైరల్‌ అవుతోంది ఈ శుభలేఖ. గోవాలో వీరిద్దరి పెళ్లి జరగనుందన్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 6న ఇందుకు సుముహూర్తం కుదిర్చారు అక్కినేని నాగార్జున. ఈ ముహూర్తంతోనే గోవాలోని వగేటర్‌ బీచ్‌లో ది డబ్ల్యు హోటల్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుందంటూ ఈ పెళ్లి శుభలేఖలో ఉంది. గత కొంత కాలంగా సమంత, చైతూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించింది. ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట అక్టోబర్‌లో పెళ్లి ముడితో ఒక్కటి కాబోతున్నారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో హైద్రాబాద్‌లో రిసప్షన్‌కి ప్లాన్‌ చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖుల పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. చైతూ నటిస్తోన్న 'యుద్ధం శరణం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తోంది. చరణ్‌ హీరోగా, సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. పెళ్లి ముహూర్తం నాటికి సమంత, చైతూ ఇద్దరూ తాము ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే యోచనలో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS