'మహానుభావుడు' సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్న డైరెక్టర్ మారుతి. ఓ పక్క డైరెక్షన్ చేస్తూనే, మరో పక్క నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. తాజాగా మారుతి నిర్మాణంలో వస్తోన్న సినిమా 'లండన్ బాబులు'. కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోంది. చిన్న కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి.
హీరో, హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉన్నాయి. రక్షిత్ హీరోగా నటిస్తున్నాడు. క్యారెక్టర్స్ చాలా సహజంగా అనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బుల్లితెరపై యాంకర్‌గా పాపులర్ అయిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి, 'అష్టా చెమ్మా' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్‌గా బాగానే పాపులర్ అయ్యింది.
'త్రిపుర' సినిమాతో తనలోని డిఫరెంట్ యాంగిల్‌ని బయటికి తీసింది. 'అష్టా చెమ్మా', 'సామి రారా', కార్తికేయ' తదితర సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంది. 'త్రిపుర' తర్వాత కొంచెం స్పీడు తగ్గింది. అయితే తాజాగా ఈ 'లండన్‌బాబులు'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతానంటోంది స్వాతి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుందంటోంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెబుతోంది. 'లండన్ బాబులు' సినిమాలో ఏదో స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు ఈ సినిమాకి.
ఈ సినిమాతో కలర్స్ స్వాతి ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి మరి. స్టోరీ ఏమంత కొత్తది కాకపోయినా, స్క్రీన్‌ప్లే సరికొత్తగా ఉండబోతోందట. ఎంటర్‌టైన్‌మెంట్‌కీ, సహజత్వానికీ పెద్ద పీట వేశారు. ఈ శుక్రవారం 'లండన్‌బాబులు' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.