తెలుగు చిత్రసీమకి ఇది మరో విషాదం. ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెల కంటి మరణం... సంగీత ప్రపంచానికి తీరని లోటు. అలతి అలతి పదాలతో పాటలు రాయడం, డబ్బింగ్ పాటలైనా సరే, తెలుగుదనం మర్చిపోకపోవడం వెన్నెలకంటి ప్రత్యేకత. దాదాపు 350 చిత్రాల్లో 2 వేలకు పైగానే పాటలు రాశారు. అందులో ఆణిముత్యాలెన్నో. ఎన్నో అనువాద చిత్రాలకు సంభాషణలు అందించారు. రాజశ్రీ తరవాత.. అనువాద చిత్రాలకు మాటలు - పాటలు అందించడంలో స్పెషలిస్టు అనిపించుకున్నారు.
వెన్నెలకంటి పాటల్లో వెరీ వెరీ స్పెషల్ పాటలివి!
* మాట రాని మౌనమిది.. మౌనవీణ గానమిది (మహర్షి)
* రాసలీల వేళ.. రాయబారమేలా (ఆదిత్య 369)
* చల్తీ కా నామ్ గాడీ - చలాకీ వన్నె లేడీ (చెట్టు కింద ప్లీడరు)
* భీమవరం బుల్లోడా పాలు కావాలా.. మురిపాలు కావాలా ( ఘరానా బుల్లోడు)
* కొండా కోనల్లో లోయల్లో.. గోదారి గంగమ్మా ఛాయల్లో (స్వాతి కిరణం)
* మధురమే సుధాగానం (బృందావనం)
* రావయ్య ముద్దుల మామా.. నీకు రాసిస్తా రాయల సీమా (సమర సింహారెడ్డి)
* మావయ్య అన్న పిలుపు ( ముద్దుల మావయ్య)
* మాటంటు మాటేనంట (ఏప్రిల్ 1 విడుదల)
* నా గూడు చెదిరింది... నా గుండె పగిలింది (నాయకుడు)
* చలిచంపుతున్న చమక్కులో గిలిగింత పుట్టింది (క్షణ క్షణం)