కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అను నేను'. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. కొరటాల - మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్: తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారగా అంచనాలున్న మాట వాస్తవమే. అయితే ఈ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో 'దూకుడు' సినిమాలో మహేష్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించారు. ఆ పాత్ర కేవలం వినోదం కోసమే. కానీ ఇప్పుడు అలా కాదట. సీరియస్ పొలిటీషియన్ క్యారెక్టర్ అంటున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రమిది. మరో పక్క మురుగదాస్‌తో మహేష్ చేస్తున్న 'స్పైడర్'. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇది కూడా పవర్ ఫుల్ పాత్రే. ఆగష్టులో ఈ సినిమా విడుదల కానుంది. 'బ్రహ్మూెత్సవం' సినిమా పరాజయం తర్వాత సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే ఈ రెండు సినిమాలపై మహేష్ ఫుల్ కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నాడట. ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకుని ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచే యోచనలో మహేష్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని పట్టాలెక్కించేశాడు. 'భరత్ అను నేను' సినిమాని సంక్రాంతి గిఫ్ట్‌గా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలన్నదే మహేష్ కోరిక.