మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ తాజా చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాక్సర్‌గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు ఈ సినిమాలో. బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వరుణ్ తండ్రి పాత్రకు ప్రాధాన్యత ఉందట. ఆ పాత్రని ఓ పాపులర్ సీనియర్ హీరో చేత చేయించాలని తలంచిన చిత్ర యూనిట్ అందుకు తమిళ హీరో మాధవన్‌తో సంప్రదింపులు చేశారట. ఆయన ఓకే అనడంతో, వరుణ్ తేజ్‌కి తండ్రి పాత్రలో మాధవన్ ఫిక్స్ అయ్యారనీ తెలుస్తోంది.
మొన్నా మధ్య అక్కినేని బుల్లోడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' చిత్రంలో విలన్‌గా కనిపించిన తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు. అదే ఆయనకు తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇప్పుడు వరుణ్ సినిమాతో మరోసారి మ్యాడీ తెలుగులో సందడి చేయబోతున్నారన్న మాట. వరుణ్ తేజ్ - మాధవన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు సినిమాకి హైలైట్ అవ్వడంతో పాటు, ఫ్రెష్ అప్పీల్ తీసుకొస్తాయంటున్నారు. మరోవైపు మాధవన్ - అనుష్క కాంబినేషన్‌లో 'నిశ్శబ్ధం' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో మాధవన్ స్టైలిష్ మ్యూజిక్ సెలబ్రిటీగా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.