పవన్ కోసం ఏమి చేయడానికైనా రెడీ అంటుంది..!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడంతో ఆయనకి అటు సామాన్య ప్రజానీకం నుండే కాకుండా ఇటు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా మద్దతు పెద్ద ఎత్తున లభిస్తున్నది.

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి తన పూర్తి మద్దతు ఉంటుంది అంటూ ఒక ప్రముఖ హీరోయిన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరంటే, నచ్చావులే సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన మాధవిలత. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కొందరు వ్యక్తుల కారణంగానే తన కెరీర్ నాశనం అయిందంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడంతో ఈమె పేరు హాట్ టాపిక్ అయి కూర్చుంది.



ఇక ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ కోసం నేను దేనికి అయినా రెడీ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇదిలావుండగా సదరు హీరోయిన్ పబ్లిసిటీ కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నది అంటున్న వారు కూడా లేకపోలేదు.

ఏదేమైనా ఎవరి నోట విన్నా ఇప్పుడు పవన్ మాటనే వినిపిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS