అలనాటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రోటీన్‌కి భిన్నంగా ఉండే కథలను ఎంచుకునే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మనసులో మెదిలిన ఈ ఆలోచనకు మొదట్లో అంతా షాకయ్యారు.
కుర్ర డైరెక్టర్, ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడేంటా అని ఆశ్యర్యపోయారు. కానీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన తపన, కృషి అంతా తెరపై 'మహానటి'ని తీర్చి దిద్దిన విధానంలో స్పష్టంగా కనిపించింది. బయోపిక్స్ తీయడానికి చాలా మంది భయపడుతుంటారు. కానీ ఓ యంగ్ డైరెక్టర్ సావిత్రి వంటి మహోన్నతమైన మహానటి జీవిత చరిత్ర అటెంప్ట్ అనే యోచన చేయడం ఒకెత్తయితే, సక్సెస్ అందుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మరో ఎత్తు.
ఇలాంటి సినిమాలను తెరకెక్కించడంలో చాలా చోట్ల తెలియకుండానే కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. కానీ ఎక్కడా పొరపాటనేదే లేకుండా, హద్దులు మీరకుండా, తానేం చూపించాలనుకున్నాడో, క్లియర్‌గా అదే ప్రేక్షకులకు చేరవేశాడు. మహానటిగా సావిత్రి ఎదిగిన తీరులోని ఎత్తు పల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఓ యంగ్ డైరెక్టర్ చేసిన ఈ సాహసాన్ని అందుకే అందరూ మెచ్చుకుంటున్నారు. అతని సక్సెస్‌ని మరింత ప్రోత్సహిస్తున్నారు.
మామూలు కమర్షియల్ మూవీ కొల్లగొట్టే రికార్డు వసూళ్లు 'మహానటి' కొల్లగొడుతుండడం ట్రేడ్ పండితులకే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకపోతే ఇంతవరకూ మిలియన్ మార్క్ దిశగా పరుగులు పెట్టిన 'మహానటి' ఈ రోజు మిలియన్ మార్క్‌ని టచ్ చేసేయడం పక్కా. 'మహానటి'లో లీడ్ రోల్ పోషించిన కీర్తిసురేష్‌కి ఇది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అంతే.!