'మహానటి'కి అక్కడ కూడా 'కీర్తి' దక్కేనా.?

మరిన్ని వార్తలు

తెలుగులో 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్‌ కొత్త సినిమాకి సైన్‌ చేసేందుకు చాలా గ్యాప్‌ తీసుకుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస పెట్టి రెండు కొత్త సినిమాలకు సైన్‌ చేసింది. అందులో ఒకటి హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ. ఇదిలా ఉంటే, తమిళంలో వరుస పెట్టి విశాల్‌, విక్రమ్‌, విజయ్‌.. ఇలా స్టార్‌ హీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న కీర్తిసురేష్‌ ఇప్పుడు అక్కడ కాస్త గ్యాప్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళంలో కీర్తి చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ లేవనే చెప్పాలి. 

 

అయితే అదే విషయం ఆమెను అడిగితే వరుస సినిమాల్లో కనిపించాను కదా.. కొంత గ్యాప్‌ ఇద్దామనుకుంటున్నా.. మంచి అవకాశమొస్తే, మళ్లీ కనిపిస్తా.. అన్నట్లుగా చెప్పి తప్పించుకుంది. ఇదిలా ఉంటే, కీర్తిసురేష్‌ త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. సీనియర్‌ హీరో అజయ్‌దేవగణ్‌ సరసన ఓ సినిమాలో చోటు దక్కించుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ బాగా సన్నబడుతోందట. ఇప్పటికే వర్కవుట్లు చేసి, చేసి బోలెడంత వెయిట్‌ లాస్‌ అయినట్లు తెలుస్తోంది. నటన పట్ల డెడికేషన్‌ ఉన్న హీరోయిన్స్‌లో కీర్తిసురేష్‌ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. 

 

ఆ డెడికేషన్‌ అంతా 'మహానటి' సినిమాలో చూపించేసింది కీర్తిసురేష్‌. ఈ సినిమా కోసం కొన్ని సీన్స్‌లో లావుగా కనిపించేందుకు బరువు పెరిగింది. కెరీర్‌కి అది నష్టమని తెలిసినా, ఒప్పుకున్న ప్రాజెక్ట్‌కి పూర్తి న్యాయం చేయాలంటే తప్పదనీ అంత పెద్ద సాహసం చేసింది. ఆమె కష్టం ఫలించి 'మహానటి' మంచి విజయం దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే కీర్తిసురేష్‌ అంటే ఓ స్టార్‌డమ్‌ ఉంది. అతి తక్కువ కాలంలోనే ఈ స్టార్‌డమ్‌ దక్కించుకుంది కీర్తి. మరి త్వరలో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న కీర్తిసురేష్‌ తన కెరీర్‌ని అక్కడ ఎలా బిల్డప్‌ చేసుకుంటుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS