'కథానాయకుడు' ఇచ్చిన షాక్ నుంచి బాలయ్యే కాదు, నందమూరి అభిమానులు కూడా తేరుకోలేకపోయారు. దాన్ని మించిన డిజాస్టర్ 'మహానాయకుడు'తో వచ్చింది. కథానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లు సాధించింది. అయితే దాన్నే అది పెద్ద డిజాస్టర్‌గా లెక్కగట్టారు. ఆ రికార్డుల్నికూడా మహానాయకుడు చెరిపివేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం 3.8 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే కాదు.. గత దశాబ్దకాలంగా ఏ తెలుగు కథానాయకుడికీ లేనంత డిజాస్టర్ ఇది.
నైజాంతో సహా ఏ ఏరియాలోనూ కోటి రూపాయల మార్క్‌ని అందుకోలేకపోయింది. ఓవర్సీస్‌లో అయితే.. ఇంకా దారుణం. గుంటూరు, నైజాంలలో చెరో 70 లక్షలు తెచ్చుకుంది. ఏరియాల వారిగా అదే ఎక్కువ మొత్తం. ఈ సినిమా లాభాలలో 40 శాతం పంపిణీదారులకు ఇద్దామనుకున్నాడు బాలయ్య. అలాగైనా నష్టాలు పూడ్చుకోవచ్చని లెక్కలేశారు పంపిణీదారులు. కానీ.. ఆ ఆశల్ని ఈ సినిమా నీరు గార్చింది. కనీసం అద్దె డబ్బులూ గిట్టుబాటు కాలేదు. మరి బాలయ్య వీళ్లని ఎలా ఆదుకుంటాడో చూడాలి.