రాజకీయాల్లోకి కొత్త మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షతో 'జనసేన' పార్టీ పెట్టినట్టు పవన్ కళ్యాణ్ చెబుతుంటాడు. పవన్ తీరు కూడా మార్పుకు బీజం వేసినట్టే కనిపిస్తుంటుంది. తాజాగా పవన్ అలాంటి నిర్ణయమే తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఏ పార్టీలో అయినా కుటుంబ సభ్యుల హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు, పెదనాన్న, బాబాయ్... ఇలా అందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. కానీ... పవన్ ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చాడు. 'ఈసారికి జనసేన టికెట్లు కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు' అని క్లారిటీగా చెప్పేశాడట.
నాగబాబుకి ఈసారి ఎన్నికలలో పాల్గొనాలని గట్టిగా ఉండేది. నరసాపురం నుంచి ఎంపీ స్థానానినికి పోటీ చేయాలనుకున్నారు. అయితే పవన్ నిర్ణయంతో నాగబాబు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈసారి నాగబాబు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం. నాగబాబు ఎన్నికలలో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. స్నేహితుడు అలీకి పవన్ టికెట్టు ఇవ్వకపోవడానికి కూడా కారణం ఇదే అని సమాచారం. మొత్తానికి పవన్ నిర్ణయం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షాక్ ఇచ్చినా.. రాజకీయాల్లో ఓ కొత్త మార్పుకి మాత్రం శ్రీకారం చుడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.