'సూపర్‌' క్యూట్‌ కౌగిలి.!

మరిన్ని వార్తలు

'మహర్షి' నుండి హీరోయిన్‌ పూజా హెగ్డే పిక్‌ బయటికి వచ్చింది. అయితే సింగిల్‌గా రాలేదు. 'మహర్షి'తో జంటగా, క్యూట్‌ ఎంట్రీ ఇచ్చింది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, పూజా హెగ్డే జంటగా 'మహర్షి' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివీపీ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇంతవరకూ మహేష్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మాత్రమే విడుదలయ్యాయి. కొన్ని లీకేజీ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. అయితే వీటిలో ఎక్కడా హీరోయిన్‌ పిక్‌ రివీల్‌ కాలేదు. తాజాగా పూజాహెగ్డే పిక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బిగి కౌగిలిలో పూజాహెగ్డే హత్తుకుపోయి ఉన్న రొమాంటిక్‌ స్టిల్‌ అది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో పూజా భలే అందంగా ఉందిలెండి. 

 

'అరవింద సమేత'లో అరవిందగా టైటిల్‌ రోల్‌ పోషించిన పూజాహెగ్డే తదుపరి చిత్రమిది. ఈ సినిమా విడుదల కోసం అభిమానుల కన్నా ఈగర్‌గా తాను వెయిట్‌ చేస్తున్నానని చెబుతోంది పూజాహెగ్డే. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇంకా అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు కానీ, మహేష్‌కి స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నాడనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS