'మహర్షి' తెర వెనుక కథ.!

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన 'మహర్షి' సినిమాకి సంబంధించి ఓ గాసిప్‌ సర్క్యులేట్‌ అవుతోంది. సినిమా రీషూట్స్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సమ్‌థింగ్‌ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయనీ, అది కూడా హీరోకీ, డైరెక్టర్‌కీ, నిర్మాతకీ మధ్యననీ టాక్‌ వినిపిస్తోంది. అయితే మహేష్‌తో డైరెక్టర్స్‌కి పెద్దగా ఇబ్బందులుండవు. కానీ ఎందుకో ఈ సినిమా విషయంలో మహేషే డైరెక్టర్‌పై అసంతృప్తిగా ఉన్నాడనీ సమాచారమ్‌. 

 

సో సినిమాలో చాలా సీన్లు రీషూట్స్‌ చేస్తున్నారట. కథ పరంగా కూడా కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయట. ఏప్రిల్‌లో సినిమా విడుదల కావల్సి ఉంది. అయితే ఈ రీషూట్స్‌ కారణంగా సినిమా మరింత లేట్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బహుశా మే నెలాఖరు కానీ, జూన్‌ కానీ కావచ్చట. ఈ మధ్య రిలీజ్‌ డేట్‌ విషయమై అభిమానుల్లో రేగిన అనుమానాలకు దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 

 

ఏది ఏమైనా అనుకున్న టైంకే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని. అయితే తాజాగా రైజ్‌ అయిన ఈ గాసిప్‌ కారణంగా అభిమానుల్లో మరోసారి టెన్షన్‌ మొదలైంది. ఈ విషయంలో మళ్లీ చిత్ర యూనిట్‌ స్పందిస్తే కానీ ఆ టెన్షన్‌కి చెక్‌ పడేట్లు లేదు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS