దిశా 'టోర్నడో' కిక్‌: దిమ్మ 'తిరిగి'పోవాల్సిందే.!

By Inkmantra - February 23, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

'లోఫర్‌' బ్యూటీ దిశాపటానీ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. వరుసగా స్టార్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, సల్మాన్‌ఖాన్‌ సరసన నటిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న 'భారత్‌' సినిమా కోసం కొన్ని ప్రత్యేక శిక్షణలు తీసుకుంటోందట దిశా. ఈ సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. హీరోతో పాటు, హీరోయిన్‌కీ యాక్షన్‌ సీన్స్‌లో ఇంపార్టెన్స్‌ ఉండనుందట. అందులో భాగంగా దిశాపటానీ స్లాప్‌ స్పిన్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

 

సినిమా కోసం కాకున్నా, ఈ బ్యూటీ ఎప్పటికప్పుడే ఇలాంటి వర్కవుట్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటుంది. అయితే ఇది మాత్రం 'భారత్‌' సినిమా కోసం ప్రత్యేకంగా నేర్చుకుంటోందట దిశాపటానీ. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇలాంటి వీడియోలు కేవలం సినిమా కోసమే కాకుండా, ఇదో సెల్ప్‌ డిఫెన్స్‌ టెక్నిక్‌గా భావించాలి. అమ్మాయిల్లో స్పూర్తిని నింపేందుకే సెలబ్రిటీలు ఇలాంటి టెక్నిక్స్‌ని వీడియోల రూపంలో పోస్ట్‌ చేస్తుంటారు. ఈ వీడియోలు చూసి కొందరు అమ్మాయిలైనా ఇన్‌స్పైర్‌ అవుతారనేది సెలబ్రిటీల ఉద్దేశ్యం. 

 

ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌కీ, దిశాపటానీకి మధ్య అఫైర్‌ ఉందనీ, టైగర్‌ ష్రాఫ్‌ స్ఫూర్తితోనే ఈ యాక్షన్‌ సీన్స్‌లో దిశా రాటు తేలిందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'బాఘీ 3' కోసం శ్రద్ధాకపూర్‌ ఓ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్‌గా దిశాపటానీ పేరును సజెస్ట్‌ చేస్తున్నాడట టైగర్‌ ష్రాఫ్‌. 'బాఘీ'లో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌ కాగా, 'బాఘీ 2'లో దిశాపటానీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS