'మహర్షి' పెదవి విప్పేది 'ఉగాది'కే.!

మరిన్ని వార్తలు

బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో అమ్మాయిలకు కిక్కెక్కించే గెటప్‌లో స్టూడెంట్‌గా 'రిషి'ని చూసేశాం. బిజినెస్‌ మేన్‌ గెటప్‌లో మహేష్‌ ఎలా ఉండబోతాడో అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్‌ రవి, మహా పాత్రల్లో అల్లరి నరేష్‌, పూజా హెగ్డే లుక్స్‌ కూడా చూసేశాం. సైలెంట్‌గానే ఇంతవరకూ 'మహర్షి' ప్రమోషన్స్‌ జరిగాయి. ఇక నెక్ట్స్‌ కాన్ఫిడెంట్‌గా డైలాగ్స్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. అది కొత్త సంవత్సరం ఉగాది స్పెషల్‌గా. 

 

ఉగాదికి 'మహర్షి' టీజర్‌ రానుందన్న సంగతి తెలిసిందే. ఉగాది రోజు ఉదయం 9 గంటల 9 నిముషాలకు 'మహర్షి' టీజర్‌ రానుంది. ఈ టీజర్‌లో ఈ సారి మహేష్‌ చెప్పే డైలాగులు ఉండబోతున్నాయట. అందుకోసం మహేష్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

9 ఎవరికి లక్కీ నెంబరో కానీ, వంశీ పైడిపల్లి ఈ సినిమా రిలీజ్‌తో పాటు, ప్రతీ ప్రమోషన్‌లోనూ 9 సంఖ్య భాగమయ్యేలా చూసుకుంటున్నాడు. మొన్న విడుదలైన ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ 'చోటీ చోటీ బాతే..' ని మార్చి 28 ఉదయం 9 గంటల 9 నిముషాలకు విడుదల చేశాడు. ఏది ఏమైనా మహేష్‌ నుండి రాబోతున్న ఈ 'మహర్షి' భారీ అంచనాల్ని నమోదు చేస్తోంది. బ్యానర్స్‌ పరంగా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ బ్యానర్స్‌లో 'మహర్షి' రూపొందుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS