అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. కానీ ఇంత వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ స్క్రిప్టు విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడని, అందుకే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదని తేలింది. త్రివిక్రమ్ స్క్రిప్టు ఎప్పుడు తయారు చేసి ఇస్తాడా? అని బన్నీ ఎదురుచూస్తుంటే... త్రివిక్రమ్ మాత్రం మహేష్‌బాబుతో జాలీగా తిరిగేస్తున్నాడు.
అవును.. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో జట్టు కట్టాడు. వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారు. అయితే.. అది సినిమా కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. మహేష్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఓ యాడ్‌ని త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈనెల 10న ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కూడా జరగబోతోంది. బన్నీతో సినిమా చేయాల్సిన టైమ్ లో త్రివిక్రమ్ ఇలా యాడ్స్‌పై దృష్టి పెట్టడం మెగా అభిమానులకు నచ్చని విషయమే.
అయితే... యాడ్ ఫిల్మ్ అనేది ఓ రోజుతో పూర్తయిపోయే పని. అందుకే.. బన్నీ కూడా త్రివిక్రమ్ ని ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని తెలిసింది.