టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ వినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందట. ఆ ఫిగర్ ఎంతా అంటే అక్షరాలా 150 కోట్లు అనీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
'శ్రీమంతుడు' తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు మహేష్‌బాబు. వరుసగా రెండు ఫ్లాప్‌లు చవి చూశాడు 'బ్రహ్మూెత్సవం', 'స్పైడర్' సినిమాలతో. అయితే ఈ సినిమాపై మాత్రం భారీగా అంచనాలున్నాయి. అందుకు మొదటి కారణం కొరటాల శివ. మహేష్ - కొరటాల కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న 'భరత్ అనే నేను' సినిమాపై ఆ స్థాయిలోనే అంచనాలు నెలకొంటున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం కూడా కావడంతో, ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ట్రేడ్ పండితులు అంచనాలు మొదలెట్టేశారు. విడుదలకు ముందే ఇంత భారీ అంచనాల టాక్ ఒక రకంగా పోజిటివ్ వైబ్స్నే క్రియేట్ చేస్తుంది. అయితే చూడాలి మరి. మహేష్ ఈ సినిమాతోనైనా అభిమానులను సంతృప్తిపరుస్తాడో లేదో. ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు ప్రమాణ స్వీకారం టీజర్‌కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా కోసం హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీని తీసుకొచ్చారు. సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.