టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో మహేష్ బాబు అగ్ర స్థానంలో ఉంటాడు. మహేష్ సినిమా అనేసరికి అటూ ఇటూగా దాదాపు వంద కోట్ల బిజినెస్ అయిపోతుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నిర్మాతకి కనీసం 30 కోట్లయినా లాభం. అందుకే మహేష్ కాల్షీట్లకు అంత డిమాండ్. మహేష్ పారితోషికం దాదాపు 25 కోట్లని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అది కాకుండా లాభాలలోనూ మహేష్ వాటా తీసుకుంటాడని టాక్. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ కొత్త మాట వినిపిస్తోంది.
పారితోషికంతో పాటుగా.. డిజిటల్‌రైట్స్ ఇవ్వమని అడుగుతున్నాడట. అంటే.. అమేజాన్ రైట్స్, యూ ట్యూబ్ రైట్స్ అన్నమాట. ఈ మధ్య కాలంలో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. అమేజాన్ అయితే సినిమాల్ని కోట్లకు కోట్లు పోసి కొంటున్నాడు. మహేష్ సినిమాకి ఈ రెండింటి రూపంలో కనీసం 20 కోట్లయినా వస్తాయి. అంటే.. ఈ 20 కోట్లు కూడా స్వాహా అన్నమాట. అనిల్ రావిపూడి సినిమా కోసం మహేష్ పారితోషికంతో పాటు డిజిటల్ రైట్స్‌కూడా డిమాండ్ చేసినట్టు, దానికి నిర్మాతలు కూడా అంగీకరించినట్టు సమాచారం.