జక్కన్న ఫోకస్‌ అంతా బాలీవుడ్‌ పైనే.!

By Inkmantra - March 20, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో బాలీవుడ్‌కి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చాడు రాజమౌళి. ఆ దెబ్బ నుండి బాలీవుడ్‌ ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఓ తెలుగు సినిమా తమకు ఇంత పోటీ వస్తుందనీ, ఓన్‌ మార్కెట్‌ని ఈ స్థాయిలో దెబ్బ తీస్తుందనీ బాలీవుడ్‌ కల్లో కూడా ఊహించి ఉండదు. కానీ బాహుబలితో అది జరిగిపోయింది. బాలీవుడ్‌లో రూపొందుతోన్న సినిమాలు కూడా ఆ తర్వాత 'బాహుబలి'నే ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. అలా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు కూడా ఇటీవల అక్కడ బోల్తా కొట్టిన సందర్భాలు కూడా చూసేశాం. 

 

ఇక ఇప్పుడు అదే రాజమౌళి నుండి 'ఆర్‌ఆర్‌ఆర్‌' రాబోతోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని జక్కన్న ఏ స్థాయిలో రూపొందించబోతున్నాడో ఆల్రెడీ ఓ ఐడియాకొచ్చేశారంతా. ఇక టాలీవుడ్‌ దిగ్గజాలైన ఎన్టీఆర్‌, చరణ్‌ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ దిగ్గజాల్ని కూడా పాత్రధారుల్ని చేసేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే అలియాభట్‌, అజయ్‌దేవగణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా సంజయ్‌దత్‌ పేరు పరిశీలనలో ఉంది. 

 

మరింత మంది బాలీవుడ్‌ ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే, 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో మరోసారి బాలీవుడ్‌ మార్కెట్‌పై జక్కన్న గట్టిగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్‌ నుండి ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఎంపికైన సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS