'మహర్షి' ఫైనల్ గా కన్‌ఫామ్‌ చేసేశాడు.!

మరిన్ని వార్తలు

'మహర్షి' సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో వస్తున్న రూమర్స్‌కి చెక్‌ పడినట్లే. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని కన్‌ఫామ్‌ చేస్తూ చిత్రయూనిట్‌ మరోసారి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసింది. ఏప్రిల్‌ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పూర్తిగా రంగం సిద్ధమైందని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. మార్చి 15కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారట. 

 

రెండు పాటలు మినహా దాదాపు చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాత దిల్‌రాజు కన్‌ఫామ్‌ చేశారు. ఇదిలా ఉంటే ఓ పక్క షూటింగ్‌ పనులు, మరోపక్క డబ్బింగ్‌ పనులు సమాంతరంగా సాగుతున్నట్లు ఇటీవల దిల్‌రాజు ఫ్యాన్స్‌కి ప్రూఫ్స్‌తో సహా చూపించారు. కానీ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో వస్తున్న గాసిప్స్‌కి చెక్‌ పడలేదు. తాజా స్టేట్‌మెంట్‌తో అయినా ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలిక. 

 

ఇదిలా ఉంటే అనుకున్న టైంకే 'మహర్షి'ని విడుదల చేసేందుకు టీమ్‌ రాత్రీ పగలూ కష్టపడి పని చేస్తోందట. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్‌బాబు రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS