దాదాపు అగ్ర హీరోలంతా ద్విపాత్రాభినయాలు చేశారు. ఒక్క మహేష్ బాబు మినహా. ఇప్పుడు మహేష్‌కి అలాంటి సినిమా దక్కిందని సమాచారం. మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఒక పాత్ర క్లాస్‌గా, మరో పాత్ర మాసీగా ఉంటుందని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్, మాఫియా నేపథ్యంలో ఈసినిమా సాగబోతోందని చెప్పుకుంటున్నారు.
మహర్షితో మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ ఓ సూపర్ హిట్ అందుకుంది. అప్పుడే తనతో మరో సినిమా చేస్తానని వంశీపైడిపల్లికి మాటిచ్చాడు మహేష్. ఇప్పుడు ఆ మాట ప్రకారమే సినిమా ఒప్పుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కైరా అడ్వాణీ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.