'రంగస్థలం' సినిమా మొదలైన కొత్తల్లో అందరిలోనూ అనుమానాలే. ఇలాంటి సినిమాని చరణ్ ఎలా ఒప్పుకున్నాడు. అసలు సుకుమార్ ఎలా తెరకెక్కిస్తున్నాడు.? టెక్నాలజీలో ఎన్నో ఎత్తులు చూసేసిన జనం 'రంగస్థలం' వంటి ఓల్డ్ బ్యాక్ డ్రాప్ మూవీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అనే అనుమానాలు తలెత్తాయి.
సినిమా విజయం విషయంలో అంతా సందిగ్ధతలోనే ఉన్నారు. కానీ సినిమా విడుదలైంది. నో మిస్టేక్స్, నో కామెంట్స్. మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్. అమలాపురం నుండి అమెరికా దాకా కలెక్షన్స్ హోరుమనిపించింది. తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ఎగువేసింది ఈ సినిమాతో. ఇక ఇలాంటి సుకుమార్ తదుపరి చిత్రం మహేష్‌బాబుతో అంటే ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా అంచనాలను మించిపోయేలానే ఉంటుంది. ఇది కూడా 'రంగస్థలం' రూపొందించిన మైత్రీ మూవీస్ బ్యానర్‌లోనే రూపొందుతుండడంతో ఆ అంచనాలను ఊహించడమే కష్టం.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందబోతోందట. యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందట. అందుకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ని దించబోతున్నారట. ప్రస్తుతం మహేష్ - వంశీ పైడిపల్లి చిత్రం 'మహర్షి' సెట్స్‌పై ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ - సుకుమార్ మూవీ పట్టాలెక్కనుంది.