సరిలేరు నీకెవ్వరు విజయోత్సవాలలో పాల్గొన్న మహేష్ బాబు.. ఆ తరవాత అమెరికా వెళ్లాడు. తన కుటుంబంతో సహా. సాధారణంగా ప్రతి సినిమా తరవాత కొంత బ్రేక్ తీసుకుని, ఆ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా గడపడం మహేష్ కి అలవాటు. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే... మహేష్ బాబుకి ఓ సర్జరీ జరిగిందని, అందుకోసమే ఆయన అమెరికా వెళ్లారని, సర్జరీ పూర్తయ్యిందని, ఇప్పుడు తిరిగి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. మహేష్ ఎప్పటిలానే కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికే అమెరికా వెళ్లారని స్పష్టమైంది. మరయితే ఈ పుకార్లు ఎలా పుట్టాయో అర్థం కావడం లేదు. ప్రస్తుతం వంశీపైడిపల్లి సినిమాపై దృష్టి పెట్టాడు మహేష్. అమెరికాలో సైతం ఈ కథ గురించి డిస్కర్షన్ చేస్తున్నాడని, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో తనలమునకలై ఉన్నాడని సమాచారం. ఈ వారంలోనే మహేష్ ఇండియా తిరిగి రాబోతున్నాడు. వచ్చాక కొత్త సినిమా విశేషాలు తెలుస్తాయి.