అభిమానులకు అండగా ఉండాలంటే సూపర్ స్టార్ కృష్ణ తరవాతే ఎవరైనా. తన అభిమానుల కోసం కృష్ణ ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. ఇందుకు ఉదాహరణలెన్నో. తన ఇంటికి ఎవరైనా అభిమాని వస్తే, ఆప్యాయంగా కలపకరించి, ఫొటోలకు ఫోజిచ్చి మరి పంపిస్తారు కృష్ణ. అభిమానుల ఇంట్లో జరిగే పెళ్లికి కృష్ణ అతిథిగా వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే మరో పెళ్లిలో.. సూపర్ స్టార్ సందడి చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన జాతీయ అధ్యక్షులు, తెరాస నాయకుడు దిద్ది రాంబాబు పద్మ దంపతుల కుమార్తె స్వాతి వివాహం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. పింగళి వెంకటరామిరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో అతి వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సూపర్ స్టార్ అతిథిగా వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కృష్ణ రాకతో.. ఆ పెళ్లి ఇంట సందడి రెట్టింపయ్యింది. "కృష్ణగారి రాక మకెంతో ఆనందం కలిగించింది. నూతన వధూవరూలకు ఆయన రాకే పెద్ద బహుమతి" అని కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.