అల వైకుంఠపురములో తరవాత మరో సినిమా చేయలేదు త్రివిక్రమ్. రూ.200 కోట్ల సినిమా తీసిన దర్శకుడు.. ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే. మధ్యలో `భీమ్లా నాయక్` సినిమాకి పనిచేయకపోతే.. త్రివిక్రమ్ కెరీర్లో రెండేళ్లు వృథాగా పోయినట్టే. మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఓ కథ తయారు చేశారు. ఈ కాంబో సెట్టయి చాలా కాలమైంది. అయితే ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇందుకు బోలెడన్ని కారణాలు.
ముందు భీమ్లా నాయక్ హడావుడిలో పడిపోయి మహేష్ సినిమా గురించి పట్టించుకోలేదు త్రివిక్రమ్. ఇప్పుడు కథ సెట్ చేసినా... మహేష్‌ని ఒప్పించడానికి కిందా మీదా పడిపోతున్నాడట. ఇప్పటికే మహేష్ ని కలిసి రెండు మూడు సార్లు కథని వినిపించాడు త్రివిక్రమ్. అయితే ప్రతీసారీ ఏదో ఓ మార్పు చెప్పి, 'మళ్లీ మార్చుకొని రండి' అంటున్నాడట త్రివిక్రమ్. హీరో చెబితే కాదనేది ఏముంది? అందుకే మహేష్ ఆలోచనలకు తగ్గట్టు కథని అటూ ఇటూ మార్చి, కొత్త థీమ్ తో వెళ్తున్నాడట.
అయినా సరే, మహేష్ సంతృప్తిగా లేడని టాక్. దాంతో ఇన్నిసార్లు కథని మార్చి త్రివిక్రమ్ కూడా విసిగిపోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'సర్కారు వారి పాట' సో..సో అనిపించుకుంది. బాక్సాఫీసు దగ్గర కన్ను తప్పి లొట్టబోయింది. అందుకే ఈ సినిమాపై మహేష్ అంత కేరింగ్ తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్‌కి మాత్రం ఇదంతా చాదస్తంలా అనిపిస్తోందట. మరి ఈ కథ ఎప్పుడు ఓకే అవుతుందో, ఎప్పుడు మొదలవుతుందో?