`మహర్షి`తో మహేష్‌బాబు - వంశీ పైడిపల్లిల బాండింగ్ బలపడిపోయింది. ఇద్దరూ మంచి దోస్తులు అయిపోయారు. అందుకే... మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఇచ్చేశాడు మహేష్. వంశీ పైడిపల్లి తదుపరి సినిమా కూడా మహేష్‌తో ఫిక్సయ్యింది. ప్రస్తుతం వంశీ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. `సరి లేరు నీకెవ్వరు` తరవాత మహేష్ చేయబోయే సినిమా అదే. కానీ.. ఇప్పుడు ఆ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈలోగా మహేష్ `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ కథని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. `సరి లేరు నీకెవ్వరు` అయిన వెంటనే నీల్ కథకి టేకాఫ్ మొదలైపోతుందని తెలుస్తోంది. ఆ సినిమా కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసి 2020 చివర్లో వంశీ పైడిపల్లి సినిమాని మొదలెడతారని తెలస్తోంది. అంటే.. వంశీ దాదాపు యేడాది పాటు ఖాళీగా ఉండాలి.
వంశీ మాత్రం 2020 వేసవిలో తన సినిమాని పట్టాలెక్కించొచ్చని భావిస్తున్నాడు. మరో ఆరు నెలలు ఎదురుచూడాలి అనిచెబితే.. వంశీ రియాక్షన్ ఎలా ఉంటుందో. మొత్తానికి మహర్షి దర్శకుడికీ, కేజీఎఫ్ దర్శకుడికీ మధ్య మహేష్ నలిగిపోతున్నాడన్నమాట.