మహేష్‌ జోస్యం ఫలిస్తోందిగా.!

మరిన్ని వార్తలు

రెండు వారాల క్రితమే మహేష్‌ విట్టా బిగ్‌ హౌస్‌ని వీడి బయటికి వచ్చేశాడు. నిజానికి మహేష్‌ వచ్చి మూడు వారాలు గడిచిపోవాలి. పునర్నవి ఎలిమినేషన్‌ అయిన రోజే మహేష్‌ ఎలిమినేట్‌ కావాలి. కానీ, అక్కడ ఏదో మ్యాజిక్‌ జరిగి, మహేష్‌ని లోపల ఉంచి, పునర్నవిని బయటికి పంపించేశారు. అసలు వివరాల్లోకి వెళితే, అంతకు ముందే ఓ సందర్భంలో మహేష్‌, శ్రీముఖి బ్యాచ్‌తో ఓ డిస్కషన్‌ పెట్టాడు.

 

ఆ డిస్కషన్‌లో భాగంగా, వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవి విడిపోవాలని కోరుకున్నాడు. క్లోజ్‌గా ఉన్న వాళ్లు విడిపోతే, ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలియాలి అన్నాడు. ఆ క్రమంలోనే రాహుల్‌ని పునర్నవి వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత రాహుల్‌ ఎంత బాధపడ్డాడో అందరం చూశాం. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో వితిక ఎలిమినేట్‌ అయ్యింది. వరుణ్‌ బాధ వర్ణనాతీతం. అలా అప్పుడు మహేష్‌ చెప్పిన జోస్యం ఇప్పుడు ఫలిస్తోంది.

 

వారి బాధను హౌస్‌లోని వారు ఇప్పుడు ఫీలవుతున్నారు. ఇక మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా, జరిగే టాస్క్‌లో గెలిచిన వారు ఒకరు ఫైనల్‌ రౌండ్‌కి చేరుకుంటారు. ఆరుగురు మాత్రమే ఉన్న హౌస్‌లో ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలంటే స్టే ట్యూన్డ్‌ బిగ్‌బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS