ఆ డైరెక్టర్ తో సినిమా చేయమని డిమాండ్ చేస్తున్న మహేష్ ఫాన్స్..!

By Thejaswini Allam - March 06, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

మహేష్ బాబు - సుకుమార్ సినిమా ఆగిపోవటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహర్షి తరువాత.. మహేష్ సినిమా సుకుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని ఫిక్స్ అవుతున్న టైమ్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. సుకుమార్ సినిమా అల్లు అర్జున్ తో అని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తరువాత.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ప్రస్తుతం సుకుమార్ తో సినిమా ఆగిపోయిందని మహేష్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. 

 

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ మరో ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సూపర్ స్టార్ అభిమానులు చాలా మంది మహేష్ నిర్ణయానికి మద్దతు పలుకుతూనే.. మరో డైరెక్టర్ పేరు సూచిస్తున్నారు. సుకుమార్ తో సినిమా పోతే పోయింది.. ఆ దర్శకుడితో మాత్రం సినిమా వదులుకోవద్దని తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. అతనే.. పూరీ జగన్నాధ్. మహేష్ - పూరీది హిట్ కాంబినేషన్. గతంలో.. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి, బిజినెస్ మేన్ రెండు సినిమాలూ మహేష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచిపోయాయి. 

 

ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పూరీతో ఓ మాస్ ఎంటర్టైనర్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో.. 'జన గణ మన' అనే టైటిల్ తో మహేష్- పూరీ ఓ సినిమాని ప్రకటించారు. కానీ ఏ కారణాల చేతనో ఆ సినిమా నిర్మాణ దశకు వెళ్లకముందే ఆగిపోయింది. ఇటీవల పుల్వామా ఎటాక్ నేపథ్యంలో పూరీ జగన్నాధ్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ పోస్ట్ చేసి అది జన గణ మన సినిమాలోనిదే అని చెప్పారు. ఆ డైలాగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 

 

పైగా పూరీ దర్శకత్వంలో సినిమా అంటే నిర్మాణం చాలా తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు త్వరలోనే పూరీ జగన్నాధ్ తో సినిమా పట్టాలెక్కించే సూచనలు మెండుగానే ఉన్నాయి. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నారన్నది తెలిసిన విషయమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS