తెలుగు నాట ఇప్పుడు సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్-మహేష్ కత్తిల వివాదం నిన్న తెలుగునాట ఉన్న మొత్తం టెలివిజన్ ఛానల్స్ కి భారీ స్థాయిలో TRP రేటింగ్స్ తెచ్చిపెట్టాయి.
ఇక ఇదే మాదిరిగా ఈనెలలో 15వ తారీఖున కూడా జరగబోతుందా అనే ప్రచారం నడుస్తున్నది. కారణం- ఆరోజున పవన్-మహేష్ ల వివాదానికి ఒక తెరపడే అవకాశం ఉన్నట్టు కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా ఓ సందేశం ఇచ్చాడు. తన ట్వీట్ లో ఈ నెల 15వ తేదీ వరకు ఓపికగా ఉండమని ఇటు పవన్ అభిమానులకి అటు మహేష్ కత్తికి కూడా సూచన చేశాడు. ఈ వివాదాన్ని శాంతి రూపంలో ముగించాలి అని అనుకుంటున్న మహేష్ కత్తి కూడా కాస్త ఓపిక పట్టాలి అని ట్వీట్ చేశాడు.
దీనితో ఆరోజు ఏమైనా జరగనుందా లేక పవర్ స్టార్ నుండి ఏదైనా ప్రకటన వెలువడనుందా అనే ఆత్రుత ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వగా దీనికి సంబంధించి జనవరి 15న ఏదొ ఒక పరిష్కారం లబిస్తుందని అందరు చూస్తున్నారు.
అయితే ఆరోజున మాత్రం నిన్నటిలాగే టెలివిజన్ ఛానల్స్ కి విపరీతమైన TRP రేటింగ్స్ వచ్చే అవకాశం లేకపోలేదు.