'శ్రీమంతుడు' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో 'ఊరు దత్తత' అనే గొప్ప కాన్సెప్ట్‌ని ఎత్తుకుని ఇద్దరూ మంచి సక్సెస్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ ఏదో సినిమాకి మాత్రమే పరిమితం కాకుండా, రియల్ శ్రీమంతుల్లో ఎంతో మందిని ప్రభావితం చేసింది కూడా. తాజాగా కొరటా శివ, మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మరో సినిమా 'భరత్ అనే నేను'. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా. అయితే ఈ సినిమాలోనూ కొరటాల ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ని ఎత్తుకోనున్నాడనీ తెలుస్తోంది. అది కూడా సామాజికంగా ఎక్కువ ప్రభావితం చూపించేదే అవుతుందట. ఈ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు.
కాగా ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాలపై హీరో ఫైట్ చేస్తాడనే సమాచారమ్ చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే 'స్పైడర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్‌బాబు సాధారణ విజయాన్నే అందుకున్నాడు కానీ, ఆశించినంత రిజల్ట్ ఆ సినిమా ద్వారా రాలేదు. కానీ కొరటాల సినిమా విషయంలో భారీగా అంచనాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందీ సినిమా. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్స్‌తో సీఎం పాత్రలో మహేష్‌బాబు నడుచుకుంటూ వస్తున్నట్లున్న ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సినిమాలో ఆశక్తికరమైన యాక్షన్ ఘట్టాలు, భళా అనిపించే సన్నివేశాలు చాలా ఉండనున్నాయట. ఈ సినిమా మహేష్‌కి 'శ్రీమంతుడు'లాగే మరో బ్లాక్ బస్టర్ కానుందని భావిస్తున్నారు.