లీకుల‌పై మ‌హేష్ సీరియ‌స్‌

By Gowthami - February 26, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

వంశీ పైడిప‌ల్లితో సినిమాని ప‌క్క‌న పెట్టేశాడు మ‌హేష్ బాబు. ఆ స్థానంలో... ప‌ర‌శురామ్ సినిమాని ప‌ట్టెక్కించే ప‌నిలో ఉన్నాడు. వంశీ సినిమా ఆగిపోవ‌డం చిత్ర‌సీమ‌ని షాక్‌కి గురి చేసింది. ఈ సినిమా ఆగిపోవ‌డ‌మేమిటి? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మ‌హ‌ర్షిలాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. పైగా ఈ సినిమాతో మ‌హేష్ కుటుంబ స‌భ్యుడిలా మారిపోయాడు వంశీ. అలాంటి వంశీ సినిమా ప‌క్క‌న పెట్ట‌డం ఎవ్వ‌రికీ మింగుడు ప‌డ‌డం లేదు.

 

అయితే తాను చెప్ప‌కుండా ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం ప‌ట్ల మ‌హేష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. సినిమా ఎందుకు ఆగిపోయింద‌న్న విష‌యంలో కొన్ని వెబ్ సైట్లు, ఛాన‌ళ్లు చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా క‌థ‌నాలు వండి వార్చ‌డం చూసిన మ‌హేష్ కాస్త గ‌ర‌మ్ గ‌ర‌మ్‌గా ఉన్నాడ‌ట‌. ఓ సినిమా ఆగిపోవ‌డం, మ‌రో సినిమాని హ‌ఠాత్తుగా ప‌ట్టాలెక్కించ‌డం మంచి సంకేతాలు పంపించే విష‌యాలు కావు. పైగా వంశీకీ తన‌కూ మ‌ధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బ‌కొట్టే అంశాలు. అందుకే మ‌హేష్ ఈ లీకులు ఎవ‌రిచ్చారో ఆరా తీస్తున్నాడ‌ట‌. ఈ సినిమా ఆగిపోవ‌డం వ‌ల్ల మైత్రీ మూవీస్ లాభ‌ప‌డుతుంది. ఎందుకంటే వెంట‌నే త‌మ బ్యాన‌ర్‌లో సినిమా మొద‌లెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. పైగా ప‌ర‌శురామ్‌తో సినిమాని ప‌ట్టాలెక్కిస్తున్న‌ది వాళ్లే. అందుకే ఈ లీకులు మైత్రీ నుంచే వచ్చే అవ‌కాశాలున్నాయ‌ని మ‌హేష్‌కి స‌మాచారం అందింద‌ట‌. అందుకే మైత్రీ నిర్మాత‌ల విష‌యంలోనూ మ‌హేష్ అలిగాడ‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS