మ‌హేష్ బాబు సినిమా ఆగిపోయిందా?

By iQlikMovies - February 11, 2019 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

మ‌హ‌ర్షి త‌ర‌వాత మ‌హేష్ బాబు - సుకుమార్ కాంబినేష‌న్లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింద‌ని స‌మాచారం. ఏప్రిల్‌లో మ‌హ‌ర్షి విడుద‌ల అవుతుంది. మే - జూన్‌ల‌లో సుకుమార్ సినిమా మొద‌ల‌వ్వాలి. కానీ.. సుకుమార్ ఇంకా క‌థ రెడీ చేయ‌లేదు. `నాకింకా టైమ్ కావాలి` అని సుకుమార్ అడ‌గ‌డంతో మ‌హేష్ ఈ సినిమాని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

 

సుకుమార్ స్క్రిప్టు పూర్తిగా సిద్ధం చేయ‌డానికి మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం అడిగాడ‌ట‌. ఈలోగా మ‌రో సినిమా చేసేయొచ్చ‌న్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌హేష్ ఈ మ‌ధ్య కొన్ని కొత్త క‌థ‌లు విన్నాడు. మే - జూన్‌ల మ‌ధ్య ఓ సినిమా మొద‌లెట్టి 2020 సంక్రాంతికి విడుద‌ల చేసేలా.. ప్లాన్ చేసుకుంటున్నాడు మ‌హేష్‌. ఇటీవ‌ల అనిల్ రావిపూడి మ‌హేష్‌కి ఓ క‌థ వినిపించిన‌ట్టు టాక్‌. ఆ క‌థే.. ఇప్పుడు ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS