'యాత్ర' విడుదలకు సిద్దమైంది. ఈ నెల 8న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అదిరే రేంజ్‌లో ఉన్నాయట. దానికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'యాత్ర' సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ పాదయాత్ర చేసినా, ఆ వైఎస్సార్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్.
ఇదిలా ఉంటే, దర్శకుడు మహి.వి.రాఘవ చాలా తెలివిగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తావుంది. ఎవరి అభిప్రాయాలు, ఎవరి అభిరుచులు వారివి. వైఎస్సార్ అంటే ఇష్టం ఉంది. కానీ ఎన్టీఆర్ పట్ల ద్వేషం లేదు. చిరంజీవి పట్ల కూడా అమితమైన అభిమానం ఉంది. ఇది ఓ సినిమా మాత్రమే. అంతకుమించి రాజకీయాలను ఆపాదించవద్దు.. అని ఆ ప్రకటనలో మహి.వి.రాఘవ పేర్కొన్నాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ఈ ఇద్దరూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమనీ పేర్కొన్నాడు. ఇది నిజంగానే చాలా తెలివైన ప్రకటన. ఎంత కాదన్నా, రాజకీయ నేపథ్యంలో సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయ ప్రభావం ఉండి తీరుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టే, తనవంతుగా వివాదాలకు తావివ్వకుండా అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు మహి తన ప్రకటన ద్వారా.
@MahiVraghav @70mmEntertains @VijayChilla @devireddyshashi @mammukka @ShivaMeka @YSRCParty @ysjagan pic.twitter.com/tCMMyQFLos
— Mahi Vraghav (@MahiVraghav) February 6, 2019