'యాత్ర‌'... బిజినెస్ బాగానే జ‌రిగిందే!!

మరిన్ని వార్తలు

మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా రూపొందిన చిత్రం `యాత్ర‌`. వైఎస్ఆర్ చేసిన పాద యాత్ర‌కు కాస్త క‌ల్పిత క‌థ కూడా జోడించ‌డంతో ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగింది. ఆంధ్ర‌లో ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ పార్టీ అభిమానులు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం అటు చిత్ర‌బృందంలోనూ, ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఉంది. 

 

అందుకే 'యాత్ర‌'కు మంచి బిజినెస్సే జ‌రిగింది. ఈ చిత్రాన్ని దాదాపు 14 కోట్ల‌కు అమ్మేశారు. నైజాంలో 3.5 కోట్లకు ఈ సినిమాని అమ్మారు. సీడెడ‌ల్‌లో 2.2 కోట్లు క‌లిపింది. ఆంధ్ర‌లో 5.5 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఓవ‌ర్సీస్‌లో నిర్మాతే సొంతంగా విడుద‌ల చేసుకుంటున్నాడు. మొత్తానికి `యాత్ర‌` బిజినెస్ బాగానేపూర్త‌యింది. 

 

శాటిలైట్ కూడా క‌లుపుకుంటే నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌లో ఉన్న‌ట్టే లెక్క‌. మ‌మ్ముట్టి సినిమా కాబ‌ట్టి మ‌ల‌యాళంలోనూ ఆడే అవ‌కాశాలున్నాయి.  మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈనెల 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS