పాపం.. త్రివిక్రమ్. ఏ ముహూర్తాన మహేష్ బాబుతో సినిమా మొదలెట్టాడో అన్నీ ఆటంకాలే. ఈ సినిమా పట్టాలెక్కడానికే చాలా సమయం తీసుకొంది. స్టోరీ లైన్ .. మార్చీ మార్చీ.. చివరికి మహేష్ ని ఎలాగోలా ఒప్పించుకోగలిగాడు. ఆ తరవాత.. ఓ ఫైట్ తో సినిమా మొదలెట్టారు. ఇక అంతా సవ్యమే అనుకొంటున్న సమయంలో.. ఫైట్ మాస్టర్లకీ, మహేష్‌కీ, త్రివిక్రమ్ కీ పడలేదంటూ గాసిప్పులు వచ్చాయి.
ఆ తరవాత... మహేష్ కి ఈ కథ నచ్చలేదని, ఫుల్ స్క్రిప్టు ఇస్తే గానీ సెట్ కి రానన్నాడని వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిది. ఆ తరవాత మహేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. మాతృమూర్తి ఇందిర కన్నుమూశారు. ఆ విషాదం నుంచి మహేష్ కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఈలోగా కథపై కసరత్తు చేశాడు త్రివిక్రమ్. అంతా సెట్ అయిపోతోందనుకొంటున్న తరుణంలో.. ఇప్పుడు కృష్ణచనిపోయారు.
ఈ బాధ నుంచి కోలుకోవడానికి మహేష్‌కి మినిమం నెల రోజులు పడుతుంది. అప్పటి వరకూ షూటింగ్ మాటే ఉండదు. ఈ వరుస బ్రేకుల వల్ల సినిమా ఏమైపోతుందో అనే కంగారు పట్టుకొంది త్రివిక్రమ్ కి. మును ముందు ఇంకేం జరుగుతాయో..?