'కెవ్వు కేకా..' అంటూ గబ్బర్ సింగ్‌లో ఆడి పాడిన ముద్దుగుమ్మ మలైకా అరోరా ఇప్పుడు అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. నాలుగు పదుల వయసులోనూ స్వీట్ సిక్స్‌టీన్‌లా అందాలారబోసేస్తూ యంగ్ భామలకు గట్టి పోటీ ఇస్తోంది గ్లామర్‌లో ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, ఈ మధ్య యంగ్‌స్టర్ అర్జున్‌కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తూ, ముద్దుగుమ్మలు మరింత కుళ్లుకునేలా సంచలనమైంది. అర్జున్‌కపూర్‌తో లవ్వు, పెళ్లి పీటలదాకా చేరిందనీ ఈ మధ్య బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ఆ యంగ్ బోయ్ ఫ్రెండ్ అర్జున్‌కపూర్‌తోనే ఇదిగో ఇలా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ రచ్చ రంభోలా చేస్తోంది. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో విచ్చలవిడిగా అందాలారేసి, ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందుతోంది. అవును మరి హాఫ్ సెంచరీకి దగ్గరవుతోన్న ఆమె దృష్టిలో ఇరవైల్లో ఉన్న బోయ్ ఫ్రెండ్‌ని వల వేసి పట్టడమంటే ఆషా మాషీ ఏం కాదు మరి. బహుశా అందుకేనేమో ఆ ఆనందం.