వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడినా తప్పు లేదు. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే హక్కు ఎవరికైనా ఉంటుంది. అలాంటిది దేశాన్నే తప్పుపడితే ఎలా ఉంటుంది? మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై లేటెస్టుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మామూలుగా స్పందిస్తే ఫర్వాలేదు. కానీ దేశాన్ని తప్పు పట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉండడంతో మల్లికా షెరావత్ స్పందన వివాదాస్పదమైంది.
'భారతదేశం అత్యాచారాలకు అడ్డాగా మారింది' అంటూ ప్రస్తుత పరిస్థితులపై ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది. ఈ దేశంలో ఉంటూ, దేశం గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తావా? అంటూ ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఓ హీరోయిన్‌గా ఈ దేశం కారణంగానే నీకు గుర్తింపు లభించింది. అలాంటిది నువ్వు పుట్టిన దేశం గురించి అనుచితంగా కామెంట్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు.
దేశంలోని వ్యవస్థల్ని ఎత్తి చూపు.. తప్పు లేదు. కానీ దేశమే తప్పుడు దేశం అనడం బాగాలేదని మల్లికా షెరావత్‌పై విమర్శల దాడి మొదలైంది సోషల్ మీడియాలో. తెలుగులో కమల్ హాసన్ నటించిన 'దశావతారం' సినిమాలో మల్లికా నటించింది. బాలీవుడ్ హాట్ బాంబ్‌గా టాలీవుడ్‌లోనూ మల్లికా షెరావత్‌కి పాపులారిటీ బాగానే ఉంది.